Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Market Closes With Huge Gains
  • రియాల్టీ, ఆటో స్టాకుల మద్దతుతో రాణించిన స్టాక్ మార్కెట్లు
  • 746 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 221 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, ఆటో స్టాకుల మద్దతుతో సూచీలు రాణించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 746 పాయింట్ల లాభంతో 80,636కి ఎగబాకింది. నిఫ్టీ 221 పాయింట్లు పెరిగి 24,585కి చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 87.66గా ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ లో ఎటర్నల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. భారతీ ఎయిర్ టెల్, బీఈఎల్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 66 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
Stock Market
Indian Stock Market
Sensex
Nifty
Share Market
Stock Market Today
Rupee Dollar
Auto Stocks
Realty Stocks

More Telugu News