Mallu Bhatti Vikramarka: ముఖ్యమంత్రి పదవిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు

Mallu Bhatti Vikramarka Comments on Chief Minister Post
  • సీఎల్పీగా ఉన్న తాను సీఎం పదవిని ఆశించానన్న భట్టి
  • డిప్యూటీ సీఎం పదవితో సంతోషంగా ఉన్నానని వెల్లడి
  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చింది నిజమేనన్న భట్టి
తాను ముఖ్యమంత్రి పదవిని ఆశించిన మాట నిజమేనని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సీఎల్పీ లీడర్ గా ఉన్న తాను సీఎం పదవిని ఆశించానని చెప్పారు. కానీ, పార్టీ హైకమాండ్ తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిందని... ఈ పదవితో తాను సంతోషంగానే ఉన్నానని తెలిపారు. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట కూడా వాస్తవమేనని భట్టి చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని... కాంగ్రెస్ దరిదాపుల్లోకి కూడా బీజేపీ, బీఆర్ఎస్ లు రాలేవని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య సఖ్యత లేదనే వార్తలపై ఆయన స్పందిస్తూ... పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేణుకా చౌదరిలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. 

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు ఎలా కట్టాలో ఏపీ ప్రభుత్వానికి తెలిస్తే... ఆ ప్రాజెక్టును ఎలా ఆపాలో తమకు తెలుసని భట్టి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నివేదికను అసెంబ్లీలో పెడతామని... అవినీతికి పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో అసెంబ్లీ నిర్ణయిస్తుందని చెప్పారు.  
Mallu Bhatti Vikramarka
Telangana
Deputy CM
CLP Leader
Komati Reddy Raj Gopal Reddy
Khammam
Ponguleti Srinivasa Reddy
Tummala Nageswara Rao
Renuka Chowdary
Kaleshwaram Project

More Telugu News