Election Commission of India: పార్లమెంటు నుంచి ఈసీ కార్యాలయం వరకు.. 300 మంది ప్రతిపక్ష ఎంపీల మార్చ్!

India Alliance MPs March From Parliament to EC Office
  • ‘ఓట్ చోరీ’, బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై నిరసన తెలియజేయడమే మార్చ్ ప్రధాన ఉద్దేశం
  • నిరసన మార్చ్‌కు అనుమతి కోరలేదన్న పోలీసులు
  • ‘ఆప్’ కూడా మార్చ్‌లో పాల్గొనే అవకాశం
25 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 300 మందికి పైగా ఎంపీలు నేడు పార్లమెంట్ నుంచి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో జరిగినట్టు ఆరోపిస్తున్న ‘ఓట్ చోరీ’ (ఓట్ల దొంగతనం), ఎన్నికలు జరగనున్న బీహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)పై నిరసన తెలియజేయడమే ఈ మార్చ్ ప్రధాన ఉద్దేశం.
 
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, డీఎంకే, ఆప్, వామపక్షాలు, ఆర్జేడీ, ఎన్సీపీ(ఎస్పీ), శివసేన (యూబీటీ), నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పలు పార్టీలు ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. ఉదయం 11:30 గంటలకు పార్లమెంట్ మకర్ ద్వార్ నుంచి ఈ మార్చ్ ప్రారంభమవుతుంది. అయితే, ఈ మార్చ్‌కు సంబంధించి అనుమతి కోరుతూ తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదని పోలీసులు తెలిపారు. 

ఈ నిరసనకు ఇండియా కూటమి పిలుపునిచ్చినప్పటికీ బ్యానర్లు లేకుండానే మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతిపక్ష కూటమి నుంచి ‘ఆప్’ బయటకు వచ్చినప్పటికీ ఈ మార్చ్‌లో అది కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాగా, ఎన్నికల సంఘం పారదర్శకంగా ఉండాలని, డిజిటల్ ఓటర్ జాబితాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు.  
Election Commission of India
Opposition MPs March
India Alliance
Vote Rigging Allegations
Lok Sabha Elections 2024
Bihar Voter List
Rahul Gandhi
Electoral Transparency
Parliament March
Protest

More Telugu News