ఖమ్మం శివారు కాలనీలో దొంగల కలకలం.. వీడియో ఇదిగో!
––
వీధిలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో కలియతిరుగుతూ డబ్బు, నగల కోసం వెతికారు. ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో దొంగల నిర్వాకం మొత్తం రికార్డైంది. రాత్రి కాలనీలో దొంగలు సంచరించిన విషయం ఉదయాన్నే గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సత్తుపల్లి పట్టణంలోని పీవీ నరసింహారావు సింగరేణి కాలరీస్‌లోనూ దొంగలు చోరీకి యత్నించారు.