RK Roja: నేడో, రేపో డీజీపీ చేతికి 'ఆడుదాం ఆంధ్రా' స్కామ్‌పై విజిలెన్స్ నివేదిక .. మాజీ మంత్రి రోజాకు షాక్ ..!

RK Roja Facing Aadudam Andhra Scam Vigilance Report
  • వైసీపీ హయాంలో రూ.119 కోట్లతో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాలు
  • పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట అవినీతికి పాల్పడినట్లు అభియోగాలు 
  • ప్రభుత్వ ఆదేశాలతో విచారణ జరిపిన విజిలెన్స్ విభాగం
వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన 'ఆడుదాం ఆంధ్రా' పోటీల నిర్వహణపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ఈ నివేదికను విజిలెన్స్ విభాగం అధికారులు ఒకటి రెండు రోజుల్లో డీజీపీకి అందజేయనున్నారు. వైసీపీ హయాంలో రూ.119 కోట్ల నిధులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు ఉన్నాయి.

క్రీడా పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరిట భారీగా నిధులు దుర్వినియోగం చేశారని విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో నాటి మంత్రి ఆర్కే రోజా పాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశించడంతో విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపట్టింది.

'ఆడుదాం ఆంధ్రా'లో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలను విజిలెన్స్ విభాగం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికలోని అంశాల ఆధారంగా బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 
RK Roja
RK Roja Aadudam Andhra
Aadudam Andhra scam
Andhra Pradesh sports
Vigilance report
YSRCP government
Corruption allegations
TDP leaders
Andhra Pradesh news

More Telugu News