Kim Jong Un: సరిహద్దుల్లో లౌడ్ స్పీకర్లు తొలగిస్తున్న ఉత్తర కొరియా
- దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు మ్యుంగ్ శాంతి యత్నాలకు ఉత్తర కొరియా సానుకూల స్పందన
- ఇప్పటికే తమ స్పీకర్లను పూర్తిగా తొలగించిన దక్షిణ కొరియా
- దక్షిణ కొరియా బాటలోనే ఉత్తర కొరియా
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కొరియా చేపట్టిన శాంతి యత్నాలకు ఉత్తర కొరియా సానుకూలంగా స్పందించింది. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధానికి కారణమైన లౌడ్‌స్పీకర్లను సరిహద్దుల నుంచి తొలగించే ప్రక్రియను శనివారం ప్రారంభించింది.
కొన్ని రోజుల క్రితమే దక్షిణ కొరియా తమ వైపు ఉన్న లౌడ్‌స్పీకర్లను పూర్తిగా తొలగించింది. దీనికి ప్రతిస్పందనగా ఇప్పుడు ఉత్తర కొరియా కూడా అదే బాటలో నడుస్తోంది. శనివారం ఉదయం నుంచి సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉత్తర కొరియా సైన్యం లౌడ్‌స్పీకర్లను తొలగిస్తున్నట్లు గుర్తించామని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ (జేసీఎస్) ఒక ప్రకటనలో తెలిపారు.
జూన్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యుంగ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఉత్తర కొరియాతో సంబంధాలను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే జూన్ 11న ఉత్తర కొరియాపై విమర్శలతో చేసే ప్రచార ప్రసారాలను నిలిపివేశారు. గత సంప్రదాయవాద యూన్ సుక్ యోల్ ప్రభుత్వ హయాంలో ఉత్తర కొరియా వేలాది చెత్త బెలూన్లను పంపడంతో, ఆరేళ్ల తర్వాత దక్షిణ కొరియా మళ్లీ లౌడ్‌స్పీకర్ల ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ఉద్రిక్తతలు తగ్గించడానికే ప్రాధాన్యత ఇస్తోంది.
లౌడ్‌స్పీకర్ల ప్రసారాలను ఆపడమే కాకుండా, ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా కరపత్రాలు పంపవద్దని పౌర బృందాలకు కూడా అధ్యక్షుడు లీ విజ్ఞప్తి చేశారు. ఈ శాంతియుత చర్యలు ఉత్తర కొరియాతో చర్చలకు మార్గం సుగమం చేస్తాయని ఆయన ఆశిస్తున్నారు. దీనికి తోడు, అమెరికాతో కలిసి ఏటా నిర్వహించే 'ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్' సైనిక విన్యాసాల పరిధిని కూడా దక్షిణ కొరియా తగ్గించింది. ఈ విన్యాసాలపై ఉత్తర కొరియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, సరిహద్దుల్లోని అన్ని ప్రాంతాల్లో ఉత్తర కొరియా ఈ స్పీకర్లను తొలగిస్తుందా లేదా అనేది ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉందని, ఉత్తర కొరియా సైనిక కదలికలను నిశితంగా గమనిస్తున్నామని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది.