Malla Reddy: రాజకీయాలు వద్దనుకుంటున్నా: మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

BRS MLA Malla Reddy Considers Retirement After Current Term
  • తనకు 73 సంవత్సరాలు వచ్చాయన్న మల్లారెడ్డి
  • వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నానని వెల్లడి
  • ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానన్న మల్లారెడ్డి
  • ఇక ఏవైపు చూడాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ వైపా, టీడీపీ వైపా, బీఆర్ఎస్ వైపా అనేది కాదని... ప్రస్తుతం తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని... వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకునే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. తనకు 73 సంవత్సరాలు వచ్చాయని... ఈ వయసులో ఏవైపూ చూడాల్సిన అవసరం లేదని అన్నారు. 

ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి అయ్యానని... ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పారు. ఆ తర్వాత రాజకీయం వద్దనుకుంటున్నానని... ప్రజలకు సేవ చేస్తూ కాలేజీలు, యూనివర్శిటీలు నడిపిద్దామనుకుంటున్నానని తెలిపారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Malla Reddy
Malla Reddy retirement
BRS MLA
Telangana politics
Telangana elections
Malla Reddy comments
BRS party
Political retirement
Hyderabad news

More Telugu News