Seethakka: ఆశీర్వదించు అక్కా అంటూ... సీతక్క కాళ్లు మొక్కిన పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar seeks blessings from Seethakka on Rakhi
  • ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
  • రేవంత్, పొన్నం ప్రభాకర్ కు రాఖీ కట్టిన సీతక్క
  • సీతక్క కాళ్లు పొన్నం ప్రభాకర్ మొక్కిన వీడియో వైరల్
దేశ వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అక్కలు, చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీలు కట్టి మంగళహారతులు ఇచ్చారు. సోదరులు వారి అక్కాచెల్లెళ్లకు కానుకలు ఇచ్చి ఆత్మీయతను పంచుకున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన మంత్రి సీతక్క ఆయనకు రాఖీ కట్టారు. 

అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు కూడా సీతక్క రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 'నన్ను ఆశీర్వదించు అక్కా' అంటూ  సీతక్క కాళ్లకు పొన్నం ప్రభాకర్ నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Seethakka
Ponnam Prabhakar
Rakhi Pournami
Telangana
Revanth Reddy
Rakhi Festival
Sister
Brother
Telangana Politics

More Telugu News