Andhra Premier League: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ట్రోఫీ ఆవిష్కరణ
- విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ – 4 ట్రోఫీ ఆవిష్కరణ
- ట్రోఫీని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు
- కార్యక్రమంలో పాల్గొన్న విక్టరీ వెంకటేశ్ తదితరులు ప్రముఖులు
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ – 4 (ఏపీఎల్ – 4) ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సందడి చేశారు. విశాఖ ఏసీఏ – వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఏపీఎల్ – 4 ట్రోఫీని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశినేని చిన్ని, శ్రీభరత్, ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేశ్, భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఏసీఏ సెక్రటరీ సానా సతీశ్ బాబు, ఏపీఎల్ గవర్నెన్స్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నటి ప్రజ్ఞా జైస్వాల్ చేసిన నృత్య ప్రదర్శనలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సీజన్‌లో 7 జట్లు 25 మ్యాచ్‌లు ఆడనున్నాయి.