APSDMA: ఈ నెల 13న అల్పపీడనం... ఏపీకి భారీ వర్ష సూచన
- ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
- శనివారం ఆరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు
- ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
- వచ్చే బుధవారానికి బంగాళాఖాతంలో అల్పపీడనం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచన
ఈ నెల 13వ తేదీ (వచ్చే బుధవారం) నాటికి వాయవ్య, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) స్పష్టం చేశాయి. దీని ప్రభావంతో ఏపీలో విస్తారంగా, పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించాయి.
మరో వైపు ద్రోణి ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా రేపు (శనివారం) ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయని పేర్కొన్నారు.