Chandrababu Naidu: కూటమి నేతలంతా కలిసి పులివెందులను గెలుచుకురండి: చంద్రబాబు

Chandrababu Naidu Urges Alliance Leaders to Win Pulivendula ZPTC Election
  • ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తున్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక
  • 40 మంది కూటమి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
  • జగన్ చేయని విధంగా పులివెందులను అభివృద్ది చేద్దామన్న చంద్రబాబు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికను ఇటు అధికారంలోని కూటమి పార్టీలు, అటు వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా తుమ్మల హేమంత్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. ఇరు పక్షాలకు చెందిన కీలక నేతలు పులివెందులలో మకాం వేసి హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి నేతలకు కీలక సూచన చేశారు. కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో పులివెందుల జడ్పీటీసీని గెలుచుకురావాలని చెప్పారు. పులివెందుల అభివృద్ధిపై తాను ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కూటమికి చెందిన 40 మంది నేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు నేతలకు సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. 

గత టీడీపీ హయాంలోనే పులివెందులకు కృష్ణా జలాలు అందించి పంటలను కాపాడామని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీని గెలుచుకురావాలని... జగన్ కూడా చేయని విధంగా పులివెందులను అభివృద్ధి చేద్దామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
Chandrababu Naidu
Pulivendula
ZPTC Election
Andhra Pradesh Politics
TDP
YSRCP
B Tech Ravi
Marella Latareddy
कृष्णा जलలు

More Telugu News