Fake currency: గుంటూరులో నకిలీ నోట్ల కలకలం

Fake currency racket busted in Guntur two arrested
  • నకిలీ 500 నోట్లు మారుస్తూ పట్టుబడ్డ గోపిరెడ్డి, జ్యోతి
  • బ్యాగ్ తో పరారైన మరో వ్యక్తి
  • నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గుంటూరులో దొంగనోట్లు పట్టుబడటం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే... రత్నగిరి కాలనీకి చెందిన గోపిరెడ్డి, జ్యోతి అనే ఇద్దరు వ్యక్తులు నకిలీ 500 నోట్లు మారుస్తూ పట్టుబడ్డారు. వీరు నకిలీ నోట్లను మారుస్తుండగా స్థానికులు గమనించారు. 

వీరిని నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుంటుండగా... ఒక వ్యక్తి బ్యాగ్ తో పరారయ్యాడు. గోపిరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు జరిపి, విచారిస్తున్నారు. 
Fake currency
Gopi Reddy
Guntur
Counterfeit money
Ratnagiri Colony
Crime news Andhra Pradesh
Jyothi
Currency exchange

More Telugu News