మ్యాటర్ క్లియర్... బీజేపీలో చేరుతున్న గువ్వల బాలరాజు
- ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు
- రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావుతో బాలరాజు భేటీ
- ఈ నెల 11న బీజేపీలో చేరుతున్న బాలరాజు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్ రావుతో ఈరోజు గువ్వల బాలరాజు భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు వీరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ గువ్వల బాలరాజు బీజేపీలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 11న (సోమవారం) ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. హైదరాబాద్ లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన బీజీపీ కండువా కప్పుకోనున్నారు.