Kishan Reddy: ఒవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ వంటి వారు బీసీలు ఎలా అవుతారు?: కిషన్ రెడ్డి

Kishan Reddy on Muslim Reservations and BC Politics in Telangana
  • మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమన్న కిషన్ రెడ్డి
  • ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ల అంశం తీసివేయాలని సూచన
  • రాష్ట్రపతి, ప్రధానిలతో తాను స్వయంగా మాట్లాడతానని వ్యాఖ్య
మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లను తీసివేస్తే... తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ల అంశాన్ని తొలగిస్తే, తాను స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలతో మాట్లాడతానని కిషన్ రెడ్డి చెప్పారు. బీసీ రిజర్వేషన్లతో ముస్లింలను ఎలా ముడిపెడతారని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించుకోవాలని సూచించారు. అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ వంటి వారు బీసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు.
Kishan Reddy
Telangana
Muslim Reservations
BC Reservations
Revanth Reddy
Asaduddin Owaisi
Azharuddin
Shabbir Ali
BJP
Droupadi Murmu

More Telugu News