Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణను నేరస్థుడిగా నిరూపించిన ఫాంహౌస్‌లోని చీర!

Prajwal Revanna Case Old Saree Turns Key Evidence
  • 47 ఏళ్ల మహిళపై అత్యాచారం కేసులో ప్రజ్వల్‌కు జీవిత ఖైదు.. రూ. 11 లక్షల జరిమానా
  • అత్యాచారం తర్వాత బాధితురాలి నుంచి చీర లాక్కుని అటకపై దాచిన వైనం
  • బాధితురాలి వాంగ్మూలంతో ప్రజ్వల్ ఫాంహౌస్‌పై దాడిచేసి చీరను స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • దానిపై వీర్యం మరకలు.. అవి ప్రజ్వల్‌వేనని డీఎన్ఏ పరీక్షలో గుర్తింపు
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసులో ఒక పాత చీర కీలక సాక్ష్యంగా మారింది. ఫాంహౌస్‌లోని అటకపై పడి ఉన్న ఆ చీర, ప్రజ్వల్ నేరాన్ని రుజువు చేసే ఫోరెన్సిక్ ఆధారాల్లో ఒకటిగా నిలిచి, ఆయనకు జీవిత ఖైదు పడేలా చేసింది.

47 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, ఆ దాడిని వీడియో తీసిన కేసులో ప్రజ్వల్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే, 11 లక్షల జరిమానా కూడా చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఈ జరిమానా మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా అందజేస్తారు. అత్యాచారం తర్వాత ప్రజ్వల్ బలవంతంగా బాధితురాలి చీరను తీసుకున్నాడు. దానిపై కీలకమైన భౌతిక ఆధారాలు ఉన్నాయి. ఆ చీరను నాశనం చేయడానికి బదులుగా, ఎవరూ గుర్తించలేరన్న ధీమాతో ప్రజ్వల్ దానిని తన ఫాంహౌస్‌లోని అటకపై దాచాడు. కానీ, అదే అతన్ని నేరస్తుడిగా పట్టించింది. 

 నివేదికలో చీర పాత్ర 
విచారణ సమయంలో పోలీసులు బాధితురాలిని ఆ రోజు ఆమె ఏం ధరించావని అడిగినప్పుడు ప్రజ్వల్ ఆ చీరను తిరిగి ఇవ్వలేదని, అది ఫాంహౌస్‌లో ఉండే అవకాశం ఉందని చెప్పింది. ఈ సమాచారంతో పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేసి, అటకపై వున్న ఆ చీరను స్వాధీనం చేసుకున్నారు. దానిని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపగా, దానిపై వీర్యం ఆనవాళ్ళు ఉన్నట్టు ధ్రువీకరించారు. డీఎన్‌ఏ పరీక్షలో అది ప్రజ్వల్ డీఎన్‌ఏతో సరిపోలింది.

ఈ చీరతో పాటు, బాధితురాలి వాంగ్మూలం కూడా కేసు దర్యాప్తులో కీలకంగా మారింది. చీరపై లభించిన డీఎన్‌ఏ ఆధారాలు ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ వాదనను బలోపేతం చేశాయి, చివరికి ఆయనకు శిక్ష పడటానికి దోహదపడ్డాయి.
Prajwal Revanna
JD(S)
Prajwal Revanna case
rape case
forensic evidence
Karnataka
sexual assault
DNA evidence
crime news
India

More Telugu News