Visakhapatnam: విశాఖలో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డ మహిళలు
- ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు
- లలితానగర్ ప్రాంతంలో మహిళలు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం
- దాడులు నిర్వహించిన నాలుగో పట్టణ పోలీసులకు పట్టుబడ్డ ఆరుగురు మహిళలు
విశాఖపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆరుగురు మహిళలను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ నాలుగో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక లలితానగర్ ప్రాంతంలో మహిళలు పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో నాలుగో పట్టణ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న ఆరుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 22వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.