Chandrababu Naidu: లిక్కర్ కేసు గురించి ఎవరూ మాట్లాడొద్దు: మంత్రులకు చంద్రబాబు హెచ్చరిక

Chandrababu warns ministers against speaking on liquor case
  • లిక్కర్ కేసును సిట్ విచారిస్తోందన్న చంద్రబాబు
  • కేసు గురించి కానీ, అరెస్టుల గురించి కానీ మాట్లాడొద్దని ఆదేశం
  • కూటమి ఎమ్మెల్యేలంతా క్రేత్ర స్థాయిలోకి వెళ్లాలన్న ముఖ్యమంత్రి
ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక హెచ్చరిక జారీ చేశారు. లిక్కర్ కేసుపై కానీ, ఈ కేసులో జరుగుతున్న అరెస్టులపై కానీ మంత్రులు ఎవరూ మాట్లాడవద్దని హెచ్చరించారు. ఈ కేసులో సిట్ విచారణ జరుపుతోందని... దీనిపై ఎవరూ మాట్లాడవద్దని చెప్పారు. 

ఇదే సమయంలో కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు కీలక సూచన చేశారు. ఎమ్మెల్యేలకు ఈ ఏడాది హాలిడే టైమ్ అయిపోయిందని... ఇకపై అందరూ యాక్టివ్ అయి ప్రజల్లోకి వెళ్లాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా పనిచేయాలని సూచించారు. 

మరోవైపు గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మద్యం విధానం వల్ల రాష్ట్రానికి రూ. 3,200 కోట్ల నష్టం వాటిల్లిందని సిట్ తెలిపింది. ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశామని... మరో 12 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయని వెల్లడించింది.
Chandrababu Naidu
Andhra Pradesh
Liquor case
AP Ministers
SIT investigation
Liquor policy
AP government
TDP
Excise policy
Andhra Pradesh politics

More Telugu News