Suman: ఏపీలో అభివృద్ధిపై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఏపీలో ప్రస్తుతం అభివృద్ధి బాగుందన్న సుమన్
- తెలుగు రాష్ట్రాలు బాగుండాలంటే ప్రభుత్వాలకు అందరూ మద్దతివ్వాలని సూచన
- తమిళనాడులో పోటీ చేయాలని తనను అడిగారని వ్యాఖ్య
ఏపీ అభివృద్ధిపై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి బాగుందని ఆయన ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు చాలా సమయం ఉందని... ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాలంటే ప్రభుత్వాలకు అందరూ మద్దతివ్వాలని సూచించారు. కొన్ని రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయని... ఆ ఎన్నికల గురించి తర్వాత ఆలోచిస్తానని చెప్పారు.
తాను తమిళనాడులోనే పుట్టి పెరిగానని... అందుకు తనను అక్కడ పోటీ చేయమని అడిగారని... అయితే, తర్వాత చెబుతానని తాను వారికి చెప్పానని తెలిపారు. సుమన్ ఈరోజు గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.