Raj Kasireddy: లిక్కర్ స్కామ్ నిందితుడు కసిరెడ్డికి అస్వస్థత... జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు

Liquor scam accused Raj Kasireddy hospitalized
  • ఏపీ లిక్కర్ స్కామ్ లో ఏ1 నిందితుడు రాజ్ కసిరెడ్డి
  • విజయవాడ జైల్లో ఉన్న కసిరెడ్డి
  • కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్న వైనం
ఏపీలో లిక్కర్ స్కామ్ రాజకీయ ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో పలువురు అరెస్టయ్యారు. వీరిలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు కూడా ఉన్నారు. అరెస్టయిన వారందరూ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. 

ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కసిరెడ్డి (ఏ1) విజయవాడ జైల్లో ఉన్నారు. ఆయన ఈరోజు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయన కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు.
Raj Kasireddy
AP Liquor Scam
Liquor Scam
Andhra Pradesh
Vijayawada Jail
Kidney Stones
Mithun Reddy
Chevireddy Bhaskara Reddy

More Telugu News