Jr NTR: నిజాయతీ గల వ్యక్తిగా నన్ను గుర్తిస్తే చాలు: జూనియర్ ఎన్టీఆర్

Jr NTR wants to be known as an honest person
  • 'వార్ 2'తో బాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్న తారక్
  • ఈ నెల 14న రిలీజ్ కాబోతున్న 'వార్ 2'
  • నటుడిగా కంటే నిజాయతీ గల వ్యక్తిగా తనను గుర్తించాలన్న తారక్
'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ పెంచుకున్న జూనియర్ ఎన్టీఆర్... ఇప్పుడు 'వార్ 2'తో బాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా ఈనెల 14న రిలీజ్ కాబోతోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమాలకు సంబంధించి... కుటుంబ వారసత్వం విషయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని, తాను ఎలాంటి ప్లాన్స్ వేసుకోలేదని చెప్పాడు. అయితే తాను నటించే చిత్రాలతో తనను గుర్తుంచుకోవాలనే ప్రయత్నం మాత్రం చేస్తానని తెలిపాడు. ఒక నటుడిగా కంటే ఒక నిజాయతీ గల మనిషిగా తనను గుర్తించాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఎమోషన్స్ తో కూడిన నిజాయతీ గల వ్యక్తిగా తనను గుర్తిస్తే చాలని తెలిపాడు. 
Jr NTR
Junior NTR
RRR movie
War 2
Bollywood entry
Telugu actor
NTR interview
NTR legacy
Indian cinema
Pan India star

More Telugu News