Urvashi: షారుక్ ఖాన్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడంపై ఊర్వశి మండిపాటు

Urvashi criticizes National Award for Shah Rukh Khan
  • నేషనల్ అవార్డ్స్ జ్యూరీపై ఊర్వశి విమర్శలు
  • సొంత ప్రయోజనాల కోసం అవార్డులు ప్రకటిస్తున్నారని మండిపాటు
  • సహాయనటి అంటే ఏమిటో జ్యూరీ చెప్పాలని డిమాండ్
కేంద్ర ప్రభుత్వం ఇటీవల 71వ జాతీయ సినీ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, జ్యూరీ ప్రకటించిన పలు అవార్డులపై విమర్శలు వెల్లువెత్తుతుండటం గమనార్హం. కథా బలం, నటీనటుల అద్భుతమైన నటన వంటివి పట్టించుకోకుండా... వారి సొంత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అవార్డులు ప్రకటించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో దక్షిణాదికి చెందిన సీనియర్ నటి ఊర్వశి కూడా నేషనల్ అవార్డులపై పెదవి విరిచారు. 

తాజాగా ప్రకటించిన జాతీయ సినీ అవార్డుల్లో ఊర్వశికి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డును ప్రకటించారు. అయితే, ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అసలు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సహాయనటి అంటే ఏమిటో జ్యూరీ సభ్యులు చెప్పాలని అన్నారు. తనను సహాయనటిగా పరిగణిస్తారా? అని ప్రశ్నించిన ఆమె... వయసు పెరిగితే సహాయనటిగా పరిగణిస్తారా? అని నిలదీశారు. తన నటనను ఏ పద్ధతిలో కొలిచారని ప్రశ్నించారు. మీరు అవార్డు ఇవ్వగానే వచ్చి సైలెంట్ గా తీసుకోవడానికి అదేమీ పెన్షన్ కాదని ఎద్దేవా చేశారు.

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వడంపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. 'పూక్కలమ్' సినిమాకు గాను మలయాళ నటుడు విజయ రాఘవన్ కు బెస్ట్ సపోర్టింగ్ కేటగిరీలో అవార్డు ఇచ్చారని... అసలు ఆయనకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలని అన్నారు. అది రూ. 250 కోట్ల సినిమా కాదని అవార్డు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. షారుక్ గతంలో ఎంతో గొప్పగా నటించిన సినిమాలకు అవార్డు ఇవ్వలేదని... ఇప్పుడు 'జవాన్' సినిమాలో నటకు అవార్డ్ ఇవ్వడం ఏమిటో జ్యూరీ సభ్యులకే తెలియాలని అన్నారు.
Urvashi
Urvashi actress
Shah Rukh Khan
National Film Awards
Vijay Raghavan
Jawan movie
Pookkalam movie
Best Actor Award
National awards controversy
Indian cinema awards

More Telugu News