BR Gavai: పదేళ్లు స్థానికంగానే ఉన్న విద్యార్థి.. రెండేళ్లు బయటకు వెళితే స్థానికత కోల్పోవడమేంటి?: సుప్రీం

Supreme Court Questions Telangana Domicile Rules
  • తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్న
  • స్థానికతకు నిర్వచనం, పరిమితులపై మార్గదర్శకాలు జారీ చేయాలన్న హైకోర్టు
  • హైకోర్టు తీర్పుపై విద్యార్థుల అప్పీల్ ను స్వీకరించిన సుప్రీంకోర్టు
పదేళ్ల పాటు స్థానికంగా చదువుకున్న విద్యార్థి ఉన్నత విద్య కోసం రెండేళ్లు పొరుగు రాష్ట్రానికి వెళితే స్థానికత ఎలా కోల్పోతారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో రెండేళ్ల పాటు చదువుకుంటే తప్పేమిటని నిలదీశారు. ఈ మేరకు తెలంగాణ స్థానికతపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, పదో తరగతి తర్వాత రెండేళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు.. స్థానికతను నిర్వచించి, పరిధిని, పరిమితులను వెల్లడిస్తూ మార్గదర్శకాలు జారీ చేయాలని తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పుపై విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రెండేళ్లు బయట ప్రాంతంలో చదువుకోవడానికి వెళితే తప్పేంటని విచారణ సందర్భంగా సీజేఐ ప్రశ్నించారు.
BR Gavai
Supreme Court
Telangana
Domicile
Local Status
Education
High Court
Abhishek Manu Singhvi
Student Petition

More Telugu News