Kalyan Banerjee: టీఎంసీలో కలహాలు.. మమతా బెనర్జీ ఆగ్రహం.. కల్యాణ్ బెనర్జీ రాజీనామా

Kalyan Banerjee Resigns Amid TMC Conflict Mamata Banerjee Takes Strict Action
  • కల్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రా మధ్య తారస్థాయికి చేరిన వివాదం
  • పార్టీలో క్రమశిక్షణ పాటించాలని సీఎం మమత హితవు
  • లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ పదవికి కల్యాణ్ బెనర్జీ రాజీనామా
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో ఎంపీల మధ్య పెరుగుతున్న కలహాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. పార్టీ ఎంపీలు కల్యాణ్ బెనర్జీ.. మహువా మొయిత్రా మధ్య ‘పంది’,‘మహిళా వ్యతిరేకి’, ‘కొంపలు కూల్చే మహిళ’వంటి తీవ్రమైన పదాలతో సాగిన పరస్పర వాగ్వివాదంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో క్రమశిక్షణ పాటించాలని ఆమె ఎంపీలకు సూచించారు.

కల్యాణ్ బెనర్జీ రాజీనామా
ఈ ఘటన తర్వాత జరిగిన వర్చువల్ సమావేశంలో పార్టీ ఎంపీల మధ్య సమన్వయం లోపించిందని మమత చెప్పడంతో, దానికి బాధ్యత వహిస్తూ లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్ పదవికి తాను రాజీనామా చేసినట్టు కల్యాణ్ బెనర్జీ తెలిపారు. ఎంపీలు పరస్పర విమర్శలకు దిగకుండా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్‌సీ) వంటి జాతీయ సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలని మమతా బెనర్జీ సూచించారు.

వివాదానికి కారణం ఏమిటి?
మహువా మొయిత్రా.. కల్యాణ్ బెనర్జీ మధ్య కొన్ని నెలలుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటీవల ఒక మీడియా పాడ్‌కాస్ట్‌లో మొయిత్రా.. కల్యాణ్‌ను ‘పంది’తో పోల్చడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. గతంలో బెనర్జీ తనను ‘మహిళా వ్యతిరేకి’ అని, ‘కొంపలు కూల్చే మహిళ’ అని ఆరోపించారని, అందుకు ప్రతిస్పందనగానే ఈ వ్యాఖ్యలు చేశానని మొయిత్రా వివరించారు.

బెనర్జీ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, ఒక పురుషుడిపై ఇలాంటి పదాలు వాడితే ఎవరూ పట్టించుకోరని, కానీ ఒక స్త్రీపై వాడితే మాత్రం దేశమంతా గగ్గోలు చేస్తుందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Kalyan Banerjee
Mamata Banerjee
TMC
Trinamool Congress
Mahua Moitra
West Bengal Politics
Indian Politics
NRC
National Register of Citizens
Parliament

More Telugu News