Kamchatka: రష్యాను కుదిపేస్తున్న వరుస భూకంపాలు.. కమ్చట్కా తీరంలో మరోసారి భూ ప్రకంపనలు

Russia Kamchatka Experiences 5 Magnitude Earthquake
  • ఇటీవల ఇక్కడే 8.8 తీవ్రతతో భారీ భూకంపం
  • తాజాగా 5 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలు
  • సముద్రతీరంలో, మధ్యస్థ లోతులో సంభవించడం తప్పిన ముప్పు
రష్యాలోని సుదూర తూర్పు ప్రాంతమైన కమ్చాట్కా ద్వీపకల్పంలో తాజాగా మరోమారు భూకంపం సంభవించింది. 5 తీవ్రతతో వచ్చిన భూకంపం ప్రజలను మరోమారు భయభ్రాంతులకు గురిచేసింది. పెట్రోపావ్లోవ్స్క్-కమ్చాట్‌స్కీ నగరానికి ఆగ్నేయంగా సుమారు 108 కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం 1:57 గంటలకు ఇది సంభవించినట్టు అక్కడి సీస్మిక్ మానిటరింగ్ సిస్టమ్స్ ధ్రువీకరించాయి.

కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం తర్వాత తాజా భూకంపం సంభవించడం గమనార్హం. ఆ భారీ భూకంపం పసిఫిక్ మహాసముద్రం అంతటా సునామీ హెచ్చరికలకు కారణమైంది. తాజా భూకంపం సముద్రతీరంలో, మధ్యస్థ లోతులో సంభవించడం వల్ల ఉపరితలంపై దాని ప్రభావం తక్కువగా ఉందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో పసిఫిక్ టెక్టోనిక్ ప్లేట్ నిరంతరం కదులుతూ ఉండటం వల్ల కమ్చాట్కా ద్వీపకల్పం తరచుగా భూకంపాలకు గురవుతోంది. దీని కారణంగా, మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
Kamchatka
Russia earthquake
Kamchatka earthquake
Russia seismic activity
Pacific Ocean
Petropavlovsk-Kamchatsky
Tsunami warning
Seismic monitoring
Earthquake news

More Telugu News