Tamil Nadu: వింత ఆచారం.. మొక్కు తీరాలంటే తలపై కొబ్బరికాయ పగలాల్సిందే!
- తమిళనాడులోని కరూర్ జిల్లాలో వింత ఆచారం
- జిల్లాలో సుమారు 400 ఏళ్ల నాటి పురాతనమైన అరుళ్‌మిగు శ్రీమహాలక్ష్మి ఆలయం
- ఏటా ఆడి మాసంలో 18 రోజులు భక్తుల దీక్ష
- 19వ రోజు తలపై కొబ్బరికాయ కొట్టించుకుని మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీ
- నిన్న ఈ క్రతువు జరగగా 800 మందికి పైగా మహిళలు, పురుషులు మొక్కులు చెల్లించుకున్న వైనం
తలపై కొబ్బరికాయ కొట్టించుకుని మొక్కు తీర్చుకునే వింత ఆచారం తమిళనాడులోని ఓ ఆలయంలో ఇప్పటికీ కొనసాగుతోంది. కరూర్ జిల్లా మేట్టుమహదానపురంలో సుమారు 400 ఏళ్ల నాటి పురాతనమైన అరుళ్‌మిగు శ్రీమహాలక్ష్మి ఆలయం ఉంది. ఏటా ఆడి మాసంలో 18 రోజులు దీక్ష చేపట్టి 19వ రోజు తలపై కొబ్బరికాయ కొట్టించుకుని మొక్కు తీర్చుకోవడం భక్తుల ఆనవాయితీ.
నిన్న ఈ క్రతువు జరగగా 800 మందికి పైగా మహిళలు, పురుషులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు వరుసగా కూర్చోగా పూజారి వారి తలపై కొబ్బరికాయలు కొట్టారు. అలా తలపై కొట్టిన కొబ్బరికాయ పగిలితేనే మొక్కు తీరినట్టు భక్తులు భావిస్తారు. ఈ వింత ఆచారం తాలూకు వార్త బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.