Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు జైలులో రూ.540 కూలి.... నెలకు రెండుసార్లు మటన్, చికెన్!

Prajwal Revannas Life in Jail Rs 540 Wage and Limited Amenities
  • అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు జీవితఖైదు 
  • జైలులో ఉదయం 6:30 గంటలకే మొదలయ్యే కఠినమైన షెడ్యూల్
  • రేవణ్ణకు కూడా ఇతర ఖైదీలకు అందించే భోజనమే.. రాగి ముద్దలు, చపాతీలు!
ఒకప్పుడు పార్లమెంటు సభ్యుడిగా నెలకు లక్ష రూపాయలకు పైగా జీతం అందుకున్న జీవితం ఆయనది. ఇప్పుడు జైలు గోడల మధ్య సాధారణ ఖైదీగా బతుకుతున్నారు. అత్యాచార కేసులో కోర్టు జీవితఖైదు శిక్ష విధించడంతో జైలులో ఊచలు లెక్కబెడుతున్న సస్పెండెడ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ గురించే ఇదంతా! 

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ జీవితం పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో పూర్తిగా మారిపోయింది. జైలు నిబంధనల ప్రకారం, ఆయనకు నెలకు కేవలం రూ. 540 మాత్రమే వేతనంగా లభించే అవకాశం ఉంది. అది కూడా జైలు అధికారులు ఏదైనా పని కేటాయిస్తేనే సాధ్యమవుతుంది. ఎంపీగా రూ.1.2 లక్షల వేతనం, ఇతర సౌకర్యాలు అందుకున్న ఆయన... తన దారుణ మనస్తత్వం కారణంగా జైలుపాలై సాధారణ ఖైదీలా రోజులు వెళ్లబుచ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఉదయం 6:30కే దినచర్య ప్రారంభం

జైలులో ప్రజ్వల్ రేవణ్ణ రోజువారీ జీవితం ఇతర ఖైదీల మాదిరిగానే ఉంటుంది. ఆయన దినచర్య ప్రతిరోజూ ఉదయం 6:30 గంటలకే మొదలవుతుంది. అల్పాహారం ముగించుకున్న తర్వాత అధికారులు కేటాయించిన పనులకు వెళ్లాల్సి ఉంటుంది. జైలు నిబంధనల ప్రకారం, మొదట్లో ఆయనకు బేకరీలో సహాయకుడిగా లేదా సాధారణ టైలరింగ్ వంటి నైపుణ్యం అవసరం లేని పనులను అప్పగిస్తారు. కనీసం ఒక సంవత్సరం పాటు ఈ పనులు చేసిన తర్వాతే, ఆయన అర్హతను బట్టి నేతపని లేదా కమ్మరి పనుల వంటి నైపుణ్యంతో కూడిన పనులకు మారే అవకాశం ఉంటుంది.

భోజనం, ఇతర సౌకర్యాలు

ఇక భోజనం విషయంలోనూ ప్రత్యేక నిబంధనలేమీ ఉండవు. అల్పాహారంలో వారంలో ఒక్కో రోజు ఒక్కో రకమైన టిఫిన్ అందిస్తారు. మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల మధ్య భోజన విరామం ఉంటుంది. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో చపాతీలు, రాగి ముద్దలు, సాంబార్, అన్నం, మజ్జిగ ఉంటాయి. వారంలో మంగళవారం గుడ్డు, నెలలో మొదటి, మూడో శుక్రవారం మటన్, రెండో, నాలుగో శనివారం చికెన్ అందిస్తారు.

ఇతర ఖైదీలకు వర్తించే నిబంధనలే ప్రజ్వల్‌కూ వర్తిస్తాయి. వారానికి రెండుసార్లు, ఒక్కో కాల్ 10 నిమిషాల చొప్పున కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేందుకు అనుమతిస్తారు. అలాగే, వారానికి ఒకసారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను కలుసుకునే అవకాశం కల్పిస్తారు. 
Prajwal Revanna
Prajwal Revanna jail
Parappana Agrahara jail
Deve Gowda grandson
Karnataka sex scandal
Indian politician arrest
jail food menu
prison labor
sexual assault case
Prajwal Revanna salary

More Telugu News