Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు... సెన్సెక్స్ 418 అప్

Sensex Ends Higher Market Closes with Gains
  • అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు
  • 157 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 87.70
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, మెటల్, ఆటో, ఐటీ స్టాకుల మద్దతుతో సూచీలు రాణించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 81,018కి ఎగబాకింది. నిఫ్టీ 157 పాయింట్లు పెరిగి 24,722కి చేరుకుంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 87.70గా ఉంది. 

బీఎస్ఈ సెన్సెక్స్ లో అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, బీఈఎల్, టాటా స్టీల్, టీసీఎస్ వంటి షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హిందుస్థాన్ యూనిలీవర్ తదితర కంపెనీల షేర్లు నష్టపోయాయి.
Sensex
Stock Market
Indian Stock Market
Nifty
Share Market
Adani Ports
Tata Steel
Rupee Value
BSE Sensex
Stock Trading

More Telugu News