Bhanu Prakash Reddy: తిరుమలలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందనే హెచ్చరికలు ఉన్నాయి: భాను ప్రకాశ్ రెడ్డి

Tirumala faces terror threat says Bhanu Prakash Reddy
  • తిరుమలలో ఏదో జరిగిపోతోందని భూమన అసత్య ప్రచారం చేస్తున్నారన్న భాను ప్రకాశ్ రెడ్డి
  • మఠాలు, పీఠాధిపతులపై టీటీడీకి గౌరవం ఉందని వ్యాఖ్య
  • భద్రత కోసమే మఠాల్లో భక్తుల ఆధార్ వివరాలు తీసుకోవాలని నోటీసులిచ్చామని వెల్లడి
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. తిరుమలలో ఏదో జరిగిపోతోందని భూమన అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తిరుమలలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నాయని... ఈ నేపథ్యంలో మూడంచెల భద్రతతో శ్రీవారి ఆలయం, భక్తులకు టీటీడీ భద్రతను కల్పిస్తోందని అన్నారు. 
 
స్వామి వారికి నిత్యం కైంకర్యాలు చేసే మఠాలు, పీఠాధిపతులు అంటే టీటీడీకి ఎంతో గౌరవం ఉందని చెప్పారు. అయితే, భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని... మఠాల్లో కూడా భక్తుల ఆధార్ వివరాలను తీసుకోవాలని నోటీసులు ఇచ్చామని తెలిపారు. వివరాలు తీసుకోవాలని టీటీడీ నోటీసులు ఇస్తే... మఠాలు, హిందూధర్మంపై దాడి అని మాట్లాడతారా? అని మండిపడ్డారు. తిరుమలలో భద్రతను పటిష్ఠం చేయడంలో భాగంగానే మఠాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించామని చెప్పారు. తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చింది వైసీపీనే అని ఆయన విమర్శించారు.
Bhanu Prakash Reddy
TTD
Tirumala
Terrorist attack threat
Bhuma Karunakar Reddy
YCP
BJP
TTD Board member
Security
Tirumala security

More Telugu News