Nara Lokesh: నూత‌న వ‌ధూవ‌రుల‌కు పెళ్లి కానుక పంపిన మంత్రి లోకేశ్

Nara Lokesh Sends Wedding Gift to Newlyweds
  • కొత్తచెరువు సీనియ‌ర్ టీడీపీ నేత చిన్న‌ప్పోళ్లు ల‌క్ష్మీనారాయ‌ణ కుమారుడి పెళ్లి
  • మంత్రి లోకేశ్ పంపిన పెళ్లి కానుక‌ను నూత‌న వ‌ధూవ‌రుల‌కు అంద‌జేసిన హీరో రోహిత్‌
  • ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ మ‌డ‌క‌శిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి
కొత్తచెరువు సీనియ‌ర్ టీడీపీ నేత, మాజీ జ‌డ్పీటీసీ చిన్న‌ప్పోళ్లు ల‌క్ష్మీనారాయ‌ణ కుమారుడు సంతోశ్, ప్రియ కృష్ణ‌ల వివాహం నిన్న మామిళ్ల‌కుంట క్రాస్‌లోని ఎస్‌జీ క‌ల్యాణ‌మండ‌పంలో ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నూత‌న వ‌ధూవ‌రుల‌కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ‌ల‌ మంత్రి నారా లోకేశ్ పెళ్లి కానుక పంపారు. 

ఆయ‌న పంపిన ప్ర‌త్యేక కానుక‌ను సినీహీరో నారా రోహిత్, మ‌డ‌క‌శిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, ఎమ్మెల్యే సింధూర వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి ల‌క్ష్మీనార‌య‌ణ‌లు నూత‌న వ‌ధూరుల‌కు అందజేశారు. ఈ కార్యక్ర‌మంలో హీరో మంచు మ‌నోజ్ దంప‌తులు, జిల్లా తెలుగు యువ‌త నేత‌లు జ‌య‌ప్ర‌కాశ్‌, అంబులెన్సు ర‌మేశ్, శీనా, టీడీజీ జిల్లా కార్య‌ద‌ర్శి సామ‌కోటి ఆది పాల్గొన్నారు.    
Nara Lokesh
AP Minister
Andhra Pradesh
Wedding Gift
Kottacheruvu
Nara Rohit
Manchu Manoj
TDP Leader

More Telugu News