Sundar Pichai: క్రికెట్ కామెంటరీ బాక్సులో గూగుల్ సీఈవో..వీడియో ఇదిగో

Sundar Pichai in Cricket Commentary Box Video
  • భారత్ – ఇంగ్లాండ్ ఐదో టెస్ట్ మ్యాచ్ కు హాజరైన గూగూల్ సీఇఓ సుందర్ పిచాయ్
  • కామెంటరీ బాక్స్‌లో సందడి చేసిన సుందర్ పిచాయ్
  • తాను చిన్నతనం నుంచే క్రికెట్ అభిమానినన్న సుందర్ పిచాయ్
భారత్ - ఇంగ్లాండ్ మధ్య ఇటీవల జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారత జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సుందర్ పిచాయ్ స్టేడియంలోని కామెంటరీ బాక్స్‌లో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

వ్యాఖ్యాత హర్ష భోగ్లేతో కలిసి సుందర్ పిచాయ్ కొద్దిసేపు కామెంటరీ కూడా అందించారు. ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను, క్రికెట్‌పై తనకున్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు. తాను చిన్నతనం నుంచే క్రికెట్ అభిమానినని ఆయన అన్నారు.

తన బెడ్‌రూమ్ గోడలపై సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ పోస్టర్లు ఉండేవని సుందర్ పిచాయ్ తెలిపారు. మ్యాచ్ జరిగే సమయంలో తన అభిమాన క్రికెటర్లు అవుట్ కావడం తట్టుకోలేకపోయేవాడినని, అందుకే లైవ్ మ్యాచ్‌లు చూడటం చాలా తక్కువ అని వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Sundar Pichai
Google CEO
India vs England
Cricket commentary
Harsha Bhogle
Sunil Gavaskar
Sachin Tendulkar
Cricket fans

More Telugu News