వర్క్ ఫ్రమ్ హోం అంటూ యువకుడికి టోకరా
- నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు
- మోసపోయిన మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన యువకుడు
- విడతల వారీగా 2 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- యువకుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి..
మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన యువకుడి నుంచి సైబర్ నేరగాళ్లు విడతల వారీగా రూ.2 లక్షలు కాజేశారు. 'వర్క్ ఫ్రమ్ హోమ్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సైబర్ నేరగాళ్లు ప్రకటన పెట్టారు. కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే ఉద్యోగంతో పాటు లాభాలు కూడా వస్తాయని నమ్మబలికారు. దీంతో ఆకర్షితుడైన యువకుడు మోసగాళ్ల మాటలు నమ్మి, విడతల వారీగా రూ.2 లక్షలు చెల్లించాడు. చివరికి మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనతో విషయం వెలుగులోకి వచ్చింది.