BhogaPuram Sarpanch: సర్పంచ్‌తో వివాహేతర సంబంధం.. లాడ్జీలో ఉండగా పట్టుకున్న మహిళ భర్త!

Sarpanch Extra Marital Affair Exposed in Vizianagaram Lodge
  • విజయనగరం జిల్లాలో ఘటన
  • సర్పంచ్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత
  • పోలీసుల తీరుపై బాధిత భర్త ఆవేదన
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఓ గ్రామ సర్పంచి వివాహేతర సంబంధం తీవ్ర కలకలం రేపింది. విజయనగరంలోని ఒక లాడ్జిలో ఆయన మరో మహిళతో ఉండగా.. ఆమె భర్త వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. 

పోలీసుల కథనం ప్రకారం గతంలో వైఎస్సార్‌సీపీ నాయకుడిగా పనిచేసి, ఆ తర్వాత జనసేనలో చేరిన సదరు సర్పంచ్.. ఒక మాజీ మంత్రి సోదరుడికి ప్రధాన అనుచరుడిగా ఉన్నాడు. ఇక, భోగాపురం మండలానికి చెందిన మహిళకు 16 ఏళ్ల క్రితం డెంకాడ మండలానికి చెందిన వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సర్పంచి ఆ మహిళను మళ్లీ వివాహం చేసుకున్నట్టు సమాచారం. తన భార్యను సర్పంచితో లాడ్జిలో చూసిన భర్త తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సర్పంచ్‌ను పట్టుకున్న ఆయన బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 

ఈ ఘటన విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధిత భర్త తీవ్ర ఆవేదన వ్యక్తంచేశాడు. ఎవరు ఎవరితోనైనా తిరగొచ్చని, చట్టంలో అలాగే ఉందని చెప్పి కేసు పెట్టేందుకు నిరాకరించారని తెలిపాడు. ఇదే ఘటనపై ఒకటో పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కె. చౌదరి స్పందిస్తూ ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున, ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామని, కేసు నమోదు చేయలేదని తెలిపారు.
BhogaPuram Sarpanch
BhogaPuram
Vizianagaram
Extra marital affair
Adultery case
Janasena
YSRCP
Police
Andhra Pradesh Politics

More Telugu News