Venukumar: వివాహేతర సంబంధం.. ప్రియురాలితో భార్యకు దొరికిన భర్త

Venukumar caught with girlfriend by wife in Rangareddy
  • రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • భర్త వేణు కుమార్ ప్రియురాలితో ఉన్నట్లు భార్యకు సమాచారం
  • బంధువులతో కలిసి వెళ్లి భర్తను రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్న భార్య
రంగారెడ్డి జిల్లా, నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలో ఒక వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రియురాలితో ఉన్న భర్తను భార్య దేహశుద్ధి చేసింది.

భర్త వేణుకుమార్ తన ప్రియురాలితో ఉన్నాడని సమాచారం అందుకున్న భార్య, వెంటనే బంధువులతో కలిసి గంధంగూడకు చేరుకుంది. అక్కడ తన భర్త ప్రియురాలితో ఉండటం చూసి ఆగ్రహించిన ఆమె, అతనికి దేహశుద్ధి చేసి నార్సింగి పోలీసులకు అప్పగించింది. తన భర్త తనను మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని బాధితురాలి కోరుతోంది.
Venukumar
Extra marital affair
Narsingi
Rangareddy district
Infidelity
Gandanguda

More Telugu News