Epuri Praveen: ఫోన్ నంబర్ బ్లాక్ చేసిన ప్రియురాలు.. యువకుడి ఆత్మహత్య
- సూర్యాపేట జిల్లా మోతె మండలం బోడబండ్లగూడెంలో ఘటన
- ఐదేళ్లుగా ప్రేమిస్తున్న యువతి దూరం పెట్టడంతో మనస్తాపం
- పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
ప్రేమించిన యువతి దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా మోతె మండలం బోడబండ్లగూడెంలో జరిగిందీ ఘటన. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఏపూరి ప్రవీణ్ (28) గత ఐదేళ్లుగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.
అయితే, ఇటీవల ఆమె ప్రవీణ్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. ప్రవీణ్ ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసింది. అంతేకాక వేరే వ్యక్తితో మాట్లాడుతున్న విషయం తెలిసి ప్రవీణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి ప్రవీణ్ మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.