Reserve Bank of India: పెరిగిన భారత్ ఫారెక్స్ నిల్వలలు

Reserve Bank of India reports increase in India forex reserves
  • ఫారెక్స్ నిల్వలు 2.703 బిలియన్లు పెరిగి 698.192 బిలియన్లకు చేరుకున్నాయన్న ఆర్బీఐ
  • విదేశీ మారక ద్రవ్య ఆస్తులు 588.926 బిలియన్లకు పెరిగాయని వెల్లడి 
  • ఈ వారంలో బంగారం నిల్వలు 1.206 బిలియన్లు పెరిగి 85.704 బిలియన్లకు చేరుకున్నాయని వివరణ  
భారతదేశ విదేశీ మారక నిల్వలు 2.703 బిలియన్ డాలర్లు పెరిగి 698.192 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. గత వారంలో నిల్వలు 1.183 బిలియన్ డాలర్లు తగ్గి 695.489 బిలియన్ డాలర్లకు పడిపోయాయని పేర్కొంది. జులై 25వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వల గణాంకాలను ఆర్బీఐ వెల్లడించింది. విదేశీ మారక ద్రవ్య ఆస్తులు 588.926 బిలియన్ డాలర్లకు పెరిగాయని తెలిపింది.

ఆర్బీఐ గణాంకాల ప్రకారం, విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ మారక ద్రవ్య ఆస్తులు 1.316 బిలియన్ డాలర్లు పెరిగి 588.926 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ వారంలో బంగారం నిల్వలు 1.206 బిలియన్ డాలర్లు పెరిగి 85.704 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది.

స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 126 మిలియన్ డాలర్లు పెరిగి 18.809 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో భారతదేశం రిజర్వు స్థానం 55 మిలియన్ డాలర్లు పెరిగి 4.753 బిలియన్ డాలర్లకు చేరింది. 
Reserve Bank of India
RBI
India forex reserves
Indian economy
Forex reserves increase
Foreign exchange assets
Gold reserves
SDR
IMF
Economic data India

More Telugu News