Virat Kohli: అప్పుడు విరాట్ కోహ్లీ బాత్రూంలోకి వెళ్లి ఏడ్చాడు: యుజ్వేంద్ర చాహల్

Virat Kohli Cried in Bathroom After World Cup Loss Says Chahal
  • 2019 వరల్డ్ కప్ సమయంలో కోహ్లీ ఏడవడం చూశానన్న చాహల్
  • క్రీజులోనే అతని కళ్లలో నీళ్లు తిరగడం చూశానన్న చాహల్
  • ఆ మ్యాచ్‌లో మరింత మెరుగ్గా  బౌలింగ్ చేయాల్సిందన్న చాహల్
టీమిండియా ఓటమి పాలైన ఒక సందర్భంలో విరాట్ కోహ్లీ బాత్రూంలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకోవడం తాను చూశానని సీనియర్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వెల్లడించాడు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో అతడు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా పోరాడినప్పటికీ ఓటమి తప్పలేదు. ఈ ఓటమి అనంతరం కోహ్లీ బాత్రూంలోకి వెళ్లి ఏడ్చినట్లు చాహల్ చెప్పాడు.

2019 వరల్డ్ కప్ సమయంలో కోహ్లీ ఏడవడం చూశానని, అతనే కాదు జట్టులోని ప్రతి ఒక్కరిది అదే పరిస్థితి అని అన్నాడు. చివరిగా క్రీజులోకి వచ్చింది తానేనని, కోహ్లీని దాటి ముందుకు వెళుతుంటే అతని కళ్లలో నీళ్లు తిరిగాయని పేర్కొన్నాడు. ధోనీకి అదే చివరి మ్యాచ్ అని గుర్తు చేసుకున్నాడు. మరో 15 పరుగులు తక్కువగా ఇస్తే బాగుండేదని, తాను మరింత మెరుగ్గా బౌలింగ్ చేయాల్సిందని చాహల్ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో చాహల్ పది ఓవర్లు వేసి 63 పరుగులు ఇచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు.
Virat Kohli
Yuzvendra Chahal
2019 World Cup
India vs New Zealand
MS Dhoni
Ravindra Jadeja

More Telugu News