Jagdeep Dhankhar: జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా.. నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల

Jagdeep Dhankhar Resigns Schedule Released for New Vice President Election
  • ఆగస్టు 7న నోటిఫికేషన్, 21న నామినేషన్‌కు చివరి తేదీ
  • సెప్టెంబర్ 9న నూతన ఉప రాష్ట్రపతి కోసం ఎన్నిక
  • అదే రోజు లెక్కింపు.. ఫలితాల ప్రకటన
నూతన ఉపరాష్ట్రపతి ఎన్నికకు శుక్రవారం షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 9న నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయగా, దానిని రాష్ట్రపతి ఆమోదించడంతో నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది.

ఆగస్టు 7న నోటిఫికేషన్ విడుదల, 21న నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీ, 22న స్క్రూటినీ ఉంటుంది. ఆగస్టు 25వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంటుంది. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు ఉంటుంది.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్యపరమైన కారణాలతో రాజీనామా చేసినట్లు ఆయన రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్‌ఖడ్‌కు 2027 ఆగస్టు వరకు పదవీ కాలం ఉంది. ఆయన రెండేళ్ల ముందే వైదొలిగారు.

పార్లమెంటు ఉభయ సభల్లో వివిధ ఖాళీలతో కలిపి సభ్యుల సంఖ్య మొత్తం 786. మెజారిటీకి 394 మంది సభ్యుల మద్దతు అవసరం. లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యుల బలం ఉంది. రాజ్యసభలో 129 మంది మద్దతు ఉంది. ఎన్డీయేకు 422 మంది, విపక్ష కూటమికి 313 మంది అనుకూలంగా ఉన్నారు.
Jagdeep Dhankhar
Vice President Election
India Vice President
Election Schedule

More Telugu News