Samsung Galaxy Book 4 Edge: అద్భుత‌మైన ఏఐ ఫీచ‌ర్ల‌తో శాంసంగ్ కొత్త ల్యాప్‌టాప్‌.. ధ‌ర ఎంతంటే..!

Samsung Galaxy Book 4 Edge Launched with AI Features
  • శాంసంగ్‌ గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ పేరిట కొత్త‌ ఏఐ ల్యాప్ టాప్‌
  • తాజాగా భార‌త మార్కెట్‌లోకి లాంచ్ చేసిన శాంసంగ్‌
  • ఈ ల్యాప్ టాప్ ధ‌ర రూ.64,990
  • 16జీబీ ర్యామ్.. 512జీబీ స్టోరేజ్
  • రీకాల్‌, లైవ్ ట్రాన్స్‌లేట్‌, కోక్రియేట‌ర్ వంటి ఏఐ టూల్స్‌
ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ పరికరాల తయారీదారు శాంసంగ్ తాజాగా ఓ నూత‌న ఏఐ ల్యాప్ టాప్‌ను భార‌త మార్కెట్‌లో విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ పేరిట ఈ కొత్త‌ ల్యాప్ టాప్‌ను తీసుకొచ్చింది. ఇందులో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగ‌న్ ఎక్స్ ప్రాసెస‌ర్‌ను వినియోగించారు. అలాగే ఇది 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వ‌స్తోంది. ఇక‌, ఈ ల్యాప్ టాప్‌ను చాలా స్లిమ్‌గా, త‌క్కువ బ‌రువు ఉండేలా డిజైన్ చేశారు. 

ధ‌ర ఎంతంటే..
ఈ ల్యాప్ టాప్ ధ‌ర రూ.64,990గా ఉంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో దీని ధర మరింత తగ్గుతుంది. శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్ షాప్ యాప్‌, శాంసంగ్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్‌, ఇత‌ర రిటైల్ స్టోర్స్‌లో ఈ ల్యాప్‌టాప్‌ను విక్ర‌యిస్తున్నారు.

 గెలాక్సీ బుక్ 4 ఎడ్జ్ స్పెసిఫికేషన్లు ఇవే.. 
ఈ ల్యాప్‌టాప్‌లో 16జీబీ ర్యామ్ ల‌భిస్తుంది. 512జీబీ స్టోరేజ్ ఉంటుంది. డాల్బీ అట్మోస్ ఆడియోకు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్‌తో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. అందువ‌ల్ల ఆడియో చాలా క్వాలిటీగా ఉంటుంది. హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ 3.2, మైక్రోఎస్‌డీ రీడ‌ర్‌, హెడ్‌ఫోన్‌, ఫింగ‌ర్ ప్రింట్ రీడ‌ర్ వంటి అద‌న‌పు స‌దుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్‌లో వైఫై 7 క‌నెక్టివిటీని అందిస్తున్నారు. 1080పి హెచ్‌డీ కెమెరా కూడా ఉంది. ఇందులో 61.2 వాట్ అవ‌ర్ బ్యాట‌రీ ఉండగా, దీనికి 65 వాట్ల యూఎస్‌బీ టైప్ సి చార్జింగ్‌ను అందిస్తున్నారు. అందువ‌ల్ల ల్యాప్ టాప్ చాలా వేగంగా చార్జింగ్ అవుతుంది.

ఆక‌ట్టుకునే ఏఐ టూల్స్‌.. 
ఈ ల్యాప్ టాప్‌లో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ ఇందులో అందిస్తున్న ఏఐ ఫీచ‌ర్లే. దీంట్లో మైక్రోసాఫ్ట్ కోపైల‌ట్ ప్ల‌స్ ఏఐ టూల్స్‌ను అందిస్తున్నారు. రీకాల్‌, లైవ్ ట్రాన్స్‌లేట్‌, కోక్రియేట‌ర్ వంటి ఏఐ టూల్స్‌తో పాటు శాంసంగ్ ఏఐ టూల్ అయిన గెలాక్సీ ఏఐ కూడా ఇందులో ల‌భిస్తుంది. ముఖ్యంగా చాట్ అసిస్ట్ అనే ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.
Samsung Galaxy Book 4 Edge
Samsung
Galaxy Book 4 Edge
AI laptop
Qualcomm Snapdragon X processor
Flipkart
Samsung India online store
AI features
Microsoft Copilot Plus
Laptop price

More Telugu News