Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ స‌మ‌న్లు

Anil Ambani Receives ED Summons in Loan Fraud Case
  • రూ. 17వేల కోట్ల విలువైన రుణాల మోసం కేసు
  • చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన ఈడీ.. స‌మ‌న్ల జారీ 
  • ఈ నెల 5న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశాలు
రిల‌య‌న్స్ గ్రూప్ ఛైర్మ‌న్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) బిగ్ షాక్ ఇచ్చింది. రూ. 17వేల కోట్ల విలువైన రుణాల మోసానికి సంబంధించిన కేసులో చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించిన ఈడీ.. ఆయ‌న‌కు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. 

కాగా, జులై 24న అనిల్ అంబానీకి చెందిన మొత్తం 50 కంపెనీలు, 25 మంది వ్యాపార భాగ‌స్వాముల ఇళ్లు, అంబానీ గ్రూప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌ల‌కు సంబంధించిన 35కు పైగా కార్యాల‌యాల్లో ఈడీ ఆక‌స్మిక సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ప్రివెన్ష‌న్ ఆఫ్ మ‌నీలాండ‌రింగ్ యాక్ట్  (పీఎంఎల్ఏ) కింద మూడు రోజుల పాటు నిర్వ‌హించిన ఈ త‌నిఖీల్లో కీల‌క డాక్యుమెంట్ల‌తో పాటు హార్డ్ డిస్క్‌ల‌ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
Anil Ambani
Reliance Group
Enforcement Directorate
ED Summons
Loan Fraud
PMLA Act
Money Laundering
Indian Businessman
Business News

More Telugu News