India vs England: చివరి టెస్టులో వరుణుడి దోబూచులాట

India vs England 5th Test Rain Interruption
  • లండన్ లోని ఓవల్ మైదానంలో టీమిండియా-ఇంగ్లండ్ చివరి టెస్టు 
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • టీమిండియాకు మొదట బ్యాటింగ్
  • తొలుత 23 ఓవర్ల వద్ద వర్షం
  • ఆ తర్వాత 29 ఓవర్ల వద్ద మరోసారి వాన
టీమిండియా, ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు నేడు ప్రారంభమైంది. అయితే తొలిరోజు ఆటలో వరుణుడు దోబూచులాడుతున్నాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. మొదట 23 ఓవర్ల వద్ద పలకరించిన వరుణుడు... లంచ్ తర్వాత మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. 29 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. 

ఆట ఆగిపోయే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 85 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 28 పరుగులతోనూ, కరుణ్ నాయర్ పరుగులేమీ లేకుండానూ క్రీజులో ఉన్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (2) ను గస్ ఆట్కిన్సన్ అవుట్ చేయగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (14) ను క్రిస్ వోక్స్ బౌల్డ్ చేశాడు. ఇక 21 పరుగులు చేసిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ రనౌట్ రూపంలో వెనుదిరగడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 
India vs England
India
England
Cricket
Test Match
Rain
Sai Sudharsan
Yashasvi Jaiswal
KL Rahul
Shubman Gill

More Telugu News