India vs England 5th Test: ఐదో టెస్టు... టీమిండియా బ్యాటింగ్ కు వర్షం అంతరాయం

India vs England 5th Test Rain Interrupts Team India Batting
  • టీమిండియా-ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
  • 23 ఓవర్లలో 2 వికెట్లకు 72 పరుగులు చేసిన భారత్
లండన్ లోని కెన్నింగ్ టన్ ఓవల్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. ఇవాళ ఆటకు మొదటి రోజు కాగా, టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిన టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. తొలి ఇన్నింగ్స్ లో 23 ఓవర్లలో 2 వికెట్లకు 72 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. దాంతో అంపైర్లు కాస్త ముందుగానే లంచ్ బ్రేక్ ప్రకటించారు. 

టీమిండియా ఇన్నింగ్స్ చూస్తే... ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14 పరుగులు చేసి అవుటయ్యారు. 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ ను సాయి సుదర్శన్, కెప్టెన్ గిల్ జోడీ ఆదుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం సాయి సుదర్శన్ 25, గిల్ 15 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో గస్ ఆట్కిన్సన్ 1, క్రిస్ వోక్స్ 1 వికెట్ తీశారు. 
India vs England 5th Test
India England Test
Sai Sudharsan
Yashasvi Jaiswal
KL Rahul
Shubman Gill
Gus Atkinson
Chris Woakes
Kennington Oval
India batting

More Telugu News