Ramachander Rao: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు పట్ల స్పందించిన తెలంగాణ బీజేపీ చీఫ్

Ramachander Rao reacts to Supreme Court verdict on defected MLAs
  • సుప్రీంకోర్టు తీర్పు మంచి పరిణామమన్న రామచందర్ రావు
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించాయని విమర్శ
  • మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు స్పందించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న తీర్పును స్వాగతిస్తున్నామని, ఇది ఒక మంచి పరిణామమని ఆయన అన్నారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహించాయని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న జనహిత పాదయాత్రపై కూడా రామచందర్ రావు స్పందించారు. ఆ పార్టీ జనహిత పాదయాత్ర చేస్తుందో లేక జనాన్ని మోసం చేసే యాత్ర చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేస్తేనే పాదయాత్ర చేసే నైతిక హక్కు ఉంటుందని ఆయన అన్నారు.
Ramachander Rao
Telangana BJP
Supreme Court
MLA defections
Speaker decision
Congress Party
Janahitha Padayatra
White paper
Telangana Politics

More Telugu News