Gilmour Space Technologies: ఆస్ట్రేలియా తొలి రాకెట్ ప్రయోగం విఫలం... ఎగరలేక కూలిపోయిన రాకెట్... వీడియో ఇదిగో!

Gilmour Space Eris Rocket Launch Fails in Australia
  • గిల్మౌర్ స్పేస్ టెక్నాలజీస్ సంస్థ అభివృద్ధి చేసిన 'ఎరిస్' రాకెట్ 
  • నిన్న ఉదయం ప్రయోగం
  • కొన్ని సెకన్లలోనే కుప్పకూలిన వైనం
ఆస్ట్రేలియా అంతరిక్ష రంగంలో ఒక మైలురాయిగా భావించిన తొలి దేశీయ రాకెట్ ప్రయోగం విఫలమైంది. గిల్మౌర్ స్పేస్ టెక్నాలజీస్ సంస్థ అభివృద్ధి చేసిన 'ఎరిస్' రాకెట్ ను బుధవారం ఉదయం ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లోని బోవెన్ పట్టణం సమీపంలోని స్పేస్‌పోర్ట్ నుంచి ప్రయోగించారు. కానీ ఇది కొన్ని సెకన్ల వ్యవధిలోనే నేలకూలింది. 

చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లడానికి ఉద్దేశించిన ఈ 23 మీటర్ల రాకెట్, లాంచింగ్ టవర్‌ కంటే కొద్ది ఎత్తుకు మాత్రం చేరగలిగింది. ఆ తర్వాత గాల్లోకి ఎగిరేందుకు విశ్వప్రయత్నాలు చేసి విఫలమైంది. తొలిసారిగా ఆస్ట్రేలియా తయారుచేసి, ఆస్ట్రేలియా గడ్డపై నుంచి తొలిసారి ప్రయోగించిన ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ఇదే కావడం గమనార్హం. ఈ విఫల ప్రయోగానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 
Gilmour Space Technologies
Australia rocket launch failure
Eris rocket
Gilmour Space
Australian space program
Bowen Queensland
rocket launch video
spaceport launch

More Telugu News