మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్
- నిన్న 52వ బర్త్డే సందర్భంగా సోనూసూద్ కీలక నిర్ణయం
- వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నటుడు
- 500 మంది వృద్ధులకు ఇందులో ఆశ్రయం కల్పించనున్నట్లు వెల్లడి
ఇందులో వృద్ధులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు వైద్య సంరక్షణ, పోషకాహారం కూడా అందించనున్నట్లు తెలిపారు. దీంతో ఈ రియల్ హీరోపై మరోసారి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, సోనూసూద్ మహమ్మారి కరోనా సమయంలో దేశంలో ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి రియల్ హీరో అనిపించుకున్న విషయం తెలిసిందే. ఎంతోమందికి సాయం చేసి ఆదుకున్నారాయన.