Amit Kishore: వరదలకు 60 లక్షల కారు నాశనమైందంటూ మున్సిపల్ కమిషనర్ కు లేఖ

Amit Kishore Sues Municipality After Flood Damages Car
  • రిపేర్ ఖర్చులకు రూ.5 లక్షలు ఇవ్వాలంటూ లీగల్ నోటీసు
  • భారీ వర్షాలకు ఘజియాబాద్ వీధుల్లోకి వరద నీరు
  • నీళ్లలో మునగడంతో మొరాయించిన మెర్సిడెజ్ బెంజ్ కారు
భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.. వీధుల్లోకి చేరిన వరద నీరు ఓ ఖరీదైన కారును ముంచెత్తాయి. దీంతో కారు మొరాయించగా రిపేర్లకు భారీగా ఖర్చయింది. దీంతో తన కారు పాడవడానికి కారణం మున్సిపాలిటి నిర్వాకమే కారణమని, కారు రిపేరుకు అయిన ఖర్చు రూ.5 లక్షలు చెల్లించాలని ఆ కారు యజమాని అమిత్ కిశోర్ మున్సిపల్ కమిషనర్ కు లీగల్ నోటీసు పంపించాడు. ఘజియాబాద్ లో చోటుచేసుకుందీ ఘటన.
బాధితుడు అమిత్ కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం..

ఈ నెల 23న షాహిదాబాద్ లోని లజపతినగర్ లో ప్రయాణిస్తుండగా తన మెర్సిడెస్ కారులోకి వరద నీరు చేరిందని అమిత్ తెలిపారు. భారీ వర్షానికి రోడ్డుపై వరద చేరిందని వివరించారు. దీనివల్ల తన కారు పాడైపోయిందని, రిపేర్లకు భారీ మొత్తం ఖర్చయిందని ఆరోపించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు తొలగించాల్సిన మున్సిపాలిటి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తన కారు పాడైందని మండిపడ్డారు. కారుకు అయిన రిపేరు ఖర్చులు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ కు లీగల్ నోటీసు పంపించారు. స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తానని ఆయన హెచ్చరించారు.
Amit Kishore
Amit Kishore car damage
Ghaziabad floods
Mercedes car flood damage
Municipal negligence
Car repair costs
Legal notice
Shahibabad floods
Lajpat Nagar floods
Uttar Pradesh floods

More Telugu News