మాలేగావ్ పేలుళ్ల కేసులో సంచలన తీర్పు..
- నిందితులు ఏడుగురూ నిర్దోషులే
- ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్
- 17 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించిన ఎన్ఐఏ కోర్టు
మాలేగావ్ పేలుళ్లు..
మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008 సెప్టెంబరు 29న భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సుమారు వందమందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును తొలుత యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) దర్యాప్తు చేపట్టగా.. కేసు తీవ్రత దృష్ట్యా తర్వాత ప్రభుత్వం దీనిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కు అప్పగించింది. ఈ పేలుళ్లకు సంబంధించి అప్పటి ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పైనా ఆరోపణలు వచ్చాయి. ప్రజ్ఞా ఠాకూర్ కు చెందిన మోటార్ సైకిల్ కు బాంబు అమర్చారని దర్యాప్తులో తేలిందని అధికారులు చెప్పారు. దీంతో ఈ కేసులో ప్రజ్ఞా ఠాకూర్ ను నిందితురాలిగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటివరకు 220 మంది సాక్షులను విచారించగా.. వారిలో 15 మంది అంతకుముందు తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడారు.