నర్సరీకి రూ.2.5 లక్షల ఫీజా..!
- ఏబీసీడీలు నేర్చుకోవడానికి నెలకు రూ.21 వేలు
- హైదరాబాద్లోని ఓ స్కూలులో భారీగా ఫీజులు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్టు
- పిల్లలను మరో స్కూలుకు పంపించాలని అంటున్న నెటిజన్లు
నర్సరీకి రూ.2.51 లక్షలు, ఒకటి రెండో తరగతులకు రూ.2.91 లక్షలు చొప్పున సదరు స్కూలు వసూలు చేస్తోందని అనురాధ తెలిపారు. ఈ లెక్కన మధ్య తరగతి ప్రజల కష్టార్జితం మొత్తం స్కూలు ఫీజులకు సరిపోయేలా లేదని చెప్పారు. ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్టుపై పలువురు యూజర్లు స్పందిస్తూ.. ఇదంతా పెద్ద స్కామ్ గా మారిందని, స్కూలు యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని కొంతమంది వాపోయారు. ప్రభుత్వం ఈ దోపిడీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, దీనికో వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లకు పిల్లలను పంపించకుండా ఉంటే సరిపోతుందని చెబుతున్నారు.