Viral Video: ఒకే కారులో స‌మంత‌-రాజ్!

Samantha and Raj Nidimoru Spotted Together Sparking Relationship Rumors
  • గత కొంతకాలంగా స‌మంత‌-రాజ్ నిడిమోరు జంట నెట్టింట‌ హాట్ టాపిక్
  • ఎక్క‌డికెళ్లిన జంట‌గా క‌నిపిస్తున్న వైనం
  • దాంతో ఇద్ద‌రి మ‌ధ్య స్ట్రాంగ్ రిలేష‌న్ ఏర్ప‌డింద‌నే పుకార్లు 
  • ఇప్పుడు మ‌రోసారి ఒకే కారులో క‌నిపించి అందరి దృష్టిలో ప‌డ్డ జంట‌
గత కొంతకాలంగా స‌మంత‌-రాజ్ నిడిమోరు జంట నెట్టింట‌ హాట్ టాపిక్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ‌ధ్య‌ రాజ్‌తో సమంత సన్నిహితంగా కనిపించడం.. తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడం చేశారు. అలాగే స‌మంత నిర్మాతగా వ‌చ్చిన తొలి చిత్రం ‘శుభం’ సక్సెస్ సెలబ్రేషన్‌లో కలిసి హాజరవడం చూసి ఇద్ద‌రి మ‌ధ్య స్ట్రాంగ్ రిలేష‌న్ ఏర్ప‌డింద‌నే పుకార్లు జోరందుకున్నాయి. 

ఇటీవ‌ల అయితే స‌మంత భుజంపై రాజ్‌ చేయి వేసి న‌డ‌వ‌గా, మ‌రో ఫొటోలో ఇద్ద‌రు ప‌క్క‌ప‌క్క‌న కూర్చొని చాలా హ్యాపీ మూడ్‌లో క‌నిపించారు. ఆ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. క‌ట్ చేస్తే ఈ జంట ఇప్పుడు ఒకే కారులో క‌నిపించి అందరి దృష్టిలో ప‌డ్డారు. ఇక, ఇది చూసిన త‌ర్వాత కొంద‌రు నెటిజ‌న్లు త్వ‌ర‌లోనే వారి రెండో పెళ్లి అంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో మ‌ళ్లీ ఈ జంట‌పై రూమ‌ర్స్ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. 

కాగా, నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత పూర్తిగా త‌న ఆరోగ్యం, కెరీర్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తున్నారు. నటిగా మాత్రమే కాకుండా, ఇటీవల నిర్మాతగాను మారి స‌క్సెస్ అందుకున్నారు. వెబ్ సిరీస్‌లు, ఇత‌ర ప్రాజెక్టులతో అభిమానులను ప‌ల‌క‌రిస్తూనే ఉన్నారు స‌మంత‌. 


Viral Video
Samantha
Samantha Ruth Prabhu
Raj Nidimoru
Samantha Raj rumors
Samantha second marriage
Shubham movie
Samantha producer
Samantha health
Samantha career

More Telugu News