Chandrababu Naidu: సింగపూర్ నుంచి విజయవాడకు చంద్రబాబు.. పెట్టుబడుల వేటలో నయా చరిత్రకు నాంది!

Chandrababu Naidu Arrives in Vijayawada After Singapore Trip
  • సింగపూర్‌లో నాలుగు రోజులు పర్యటించిన చంద్రబాబు
  • బాబు పర్యటనతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం
  • రాత్రి 11.25 గంటలకు గన్నవరం చేరుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త పెట్టుబడులు, వేలాది ఉద్యోగ అవకాశాలను తీసుకొచ్చే సంకల్పంతో సింగపూర్‌లో సుడిగాలి పర్యటన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత రాత్రి విజయవాడ చేరుకున్నారు. రాత్రి 11:25 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో అడుగుపెట్టిన సీఎంకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది.

రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే దిశగా సాగిన ఈ నాలుగు రోజుల సింగపూర్ పర్యటనలో చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ, టీజీ భరత్, ఉన్నతాధికారుల బృందం పలు అంతర్జాతీయ సంస్థలతో కీలక చర్చలు జరిపింది. ఈ పర్యటనతో రాష్ట్రానికి గణనీయమైన పెట్టుబడులు రావడం ఖాయమని అధికార వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

విమానాశ్రయంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తదితర ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు.   
Chandrababu Naidu
Andhra Pradesh
Singapore
Investments
Nara Lokesh
Vijayawada
AP investments
Job opportunities
Singapore investments AP

More Telugu News