FICCI: 25 శాతం సుంకం.. ట్రంప్ నిర్ణయంపై స్పందించిన ఫిక్కీ

FICCI Reacts to Trumps 25 Percent Tariff Hike
  • అమెరికా నిర్ణయంపై ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ అసంతృప్తి
  • ఇది తమను నిరాశకు గురి చేసిందన్న ఫిక్కీ అధ్యక్షుడు
  • త్వరలో వాణిజ్య ఒప్పందం ఖరారవుతుందని ఆశాభావం
భారతీయ వస్తువులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలను 25 శాతం పెంచడంపై ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ స్పందించారు. ట్రంప్ నిర్ణయంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. భారతదేశ ఎగుమతులపై 25 శాతం పన్ను విధించాలని నిర్ణయించడం నిరాశ కలిగించిందని హర్షవర్ధన్ అన్నారు. ఇది దురదృష్టకరమైన చర్య అని అభివర్ణించారు.

అమెరికా నిర్ణయం తమ ఎగుమతులపై ప్రభావం చూపుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ అధిక సుంకాలు స్వల్పకాలికమేనని, త్వరలో రెండు దేశాల మధ్య శాశ్వత వాణిజ్య ఒప్పందం ఖరారవుతుందని ఆశిస్తున్నామని ఫిక్కీ అధ్యక్షుడు పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగస్ట్ 1వ తేదీ నుంచి భారతీయ ఉత్పత్తులపై 25 శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే రష్యా నుంచి భారత్ అధికంగా సైనిక ఉత్పత్తులు కొనుగోలు చేస్తోందని, ముఖ్యంగా చమురును దిగుమతి చేసుకుంటోందని ఆయన తెలిపారు. వాటిపై పెనాల్టీ విధించనున్నట్లు స్పష్టం చేశారు.
FICCI
Harshvardhan
Donald Trump
US Tariffs
India US Trade
Indian Exports
US Trade Policy

More Telugu News